AP Govt: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని వివిధ శాఖల్లో పెండింగ్ బిల్లులు, వివిధ పథకాల లబ్దిదారులకు గత ప్రభుత్వం చెల్లించని బకాయిల లెక్కలను అధికారులు తీస్తున్నారు. పెండింగ్ బిల్లులు, స్కీంలకు సంబంధించిన బకాయిల లెక్కలే ఒక లక్ష కోట్ల రూపాయలు ఉంటాయని అంచనా వేశారు.