దుబాయ్ పర్యటనలో ఏపీకి భారీ పెట్టుబడులు తీసుకువస్తున్నట్లు మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి ప్రకటించడంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సెటైర్లు వేశారు. ఖాళీ కుర్చీలకు ఊకదంపుడు ఉపన్యాసం ఇవ్వడానికి అబుదాబి వరకూ వెళ్లాలా మేకపాటి గౌతమ్ రెడ్డి గారూ అంటూ ఎద్దేవా చేశారు. పైగా జగన్ గురించి పెద్దగా ఇక్కడ ఎవరికి తెలియదని సెలవివ్వడం మేకపాటి గౌతమ్‌రెడ్డి స్పీచ్‌కే హైలెట్ అని లోకేష్ విమర్శలు చేశారు. చెత్త పాలన, బెదిరింపుల దెబ్బకి ఇతర రాష్ట్రాలకు…
దుబాయ్ లో దుబాయ్ ఎక్స్‌పో 2020 ఎగ్జిబిషన్ జరుగుతున్నది. అక్టోబర్ 1 వ తేదీ నుంచి వచ్చే ఏడాది మార్చి వరకు ఆరు నెలలపాటు ఈ ఎగ్జిబిషన్ జరుగనున్నది. దీనికోసం దుబాయ్ ఎడారి ప్రాంతంలోని 1080 ఎకరాల్లో వేల కోట్ల రూపాయలు ఖర్చుచేసి ఓ అద్భుతలోకాన్ని సృష్టించింది. 192 దేశాలు ఈ ఎగ్జిబిషన్‌లో పాల్గొనబోతున్నాయి. ఆసియాలో జరగబోతున్న తొలి అంతర్జాతీయ ఎక్స్ పో కావడంతో ప్రాముఖ్యత ఏర్పడింది. ఇప్పటి వరకు ఇలాంటి భారీ అంతర్జాతీయ ఎక్స్‌పోలను…