తెలుగు ఇండియన్ ఐడిల్ మరో స్థాయికి చేరుకుంది. ఈ వీకెండ్ నుండి కంటెస్టెంట్స్ కు ఓటింగ్ లైన్స్ ఓపెన్ అయ్యాయి. న్యాయ నిర్ణేతలు తమన్, నిత్యామీనన్, కార్తీక్ తో పాటు వీక్షకులు వేసే ఓట్లను కూడా పరిగణనలోకి తీసుకోబోతున్నారు. మొత్తం పన్నెండు మందిలో ఎపిసోడ్ 9లో ఆరుగురు పాటలు పాడి తమ ప్రతిభను చాటారు. దాదాపు గంట నిడివి ఉన్న ఈ ఎపిసోడ్ లో మొదటి ఎనిమిది నిమిషాలు అందరూ వచ్చి కూర్చోవడం, శ్రీరామచంద్రను తమన్ తనదైన…