Off The Record: ఏపీలో ఒకపక్క జోరుగా వర్షాలు పడుతుంటే…. మరోవైపు పొలిటికల్ హీట్ మాత్రం పొగలు పుట్టిస్తోంది. అందులోనూ… పై స్థాయిలో కూటమి పార్టీల మధ్య కుమ్ములాటలు పైకి కనిపించకున్నా… లోలోపల కుళ్ళబొడిచేసుకుంటున్నట్టు అంచనా వేస్తున్నారు పొలిటికల్ పండిట్స్. ప్రత్యేకించి ఇటీవల జరుగుతున్న కొన్ని ఘటనల్నే ఇందుకు ఉదాహరణగా చూపిస్తున్నారు. అందులోనూ… భీమవరం డీఎస్పీ వ్యవహారాన్ని బాగా హైలైట్ చేసి చూపిస్తున్నారు రాజకీయ ప్రత్యర్థులు. డీఎస్పీ జయసూర్య తీరును తీవ్రంగా తప్పుపట్టారు డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్.…