ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో “పుష్ప” అనే భారీ పాన్ ఇండియన్ యాక్షన్ ఎంటర్టైనర్ రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన బిగ్ అనౌన్స్మెంట్ రాబోతోంది. ఈ రోజు రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ పుట్టినరోజును జరుపుకుంటున్నారు. “పుష్ప”కు డీఎస్పీ సంగీత సారధ్యం వహిస్తున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాతలు మూవీ ఆడియో ఆల్బమ్ నుండి మొదటి సింగిల్‌పై పెద్ద అప్‌డేట్‌ను ప్రకటించడానికి ప్లాన్ చేస్తున్నారు.…