ఆంధ్రప్రదేశ్‌లో డీఎస్సీ, టెట్ నిర్వహణకు లైన్ క్లియర్ చేసింది సుప్రీంకోర్టు.. దీంతో, ఏపీలో షెడ్యూల్ ప్రకారమే డీఎస్సీ నిర్వహించేందుకు అధికారులు సిద్ధం అవుతున్నారు.. డీఎస్సీ పరీక్షలు వాయిదా వేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు..టెట్, డీఎస్సీ పరీక్షలు షెడ్యూల్ వాయిదా వేయాలంటూ ఆరుగురు అభ్యర్థులు దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు..
తెలంగాణలో షెడ్యూల్ ప్రకారమే డీఎస్సీ పరీక్షలు నిర్వహించాలని విద్యాశాఖ నిర్ణయించింది. ప్రస్తుత నోటిఫికేషన్‌ను రద్దు చేసి మరిన్ని పోస్టులను జత చేసిన మెగా డీఎస్సీ నిర్వహించాలన్న డిమాండ్‌తో అభ్యర్థులు ఆందోళన చేస్తున్నారు. ఈ రోజు కూడా పాఠశాల విద్యాశాఖ డైరెక్టరేట్ ముందు అభ్యర్థులు ఆందోళన చేశారు.