ఆంధ్రప్రదేశ్ లో డీఎస్సీ పరీక్షలు ప్రారంభమైన విషయం తెలిసిందే. జూన్ 06 నుంచి 30వ తేదీ వరకు DSC పరీక్షలు కొనసాగుతాయి. అయితే పరీక్షలు రాస్తున్న టీచర్ అభ్యర్థులకు ప్రభుత్వం బిగ్ అలర్ట్ ఇచ్చింది. ఈ నెల 20, 21 తేదీల్లో జరగాల్సిన డీఎస్సీ పరీక్షలు వాయిదా పడ్డాయి. దీనికి గల కారణం ఏంటంటే.. అంతర్జాతీయ యోగా డే సందర్భంగా వాయిదా వేశారు. వాయిదా పడిన పరీక్షలను వచ్చే నెల 1, 2 తేదీల్లో నిర్వహించనున్నట్లు అధికారులు…
నేటి నుంచి ఆంధ్రప్రదేశ్‌లో మెగా డీఎస్సీ పరీక్షలు జరగనున్నాయి.. డీఎస్సీ ఆన్‌లైన్ పరీక్షలకు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు అధికారులు.. నేటి నుంచి ఈనెల 30వ తేదీ వరకు DSC పరీక్షలు కొనసాగుతాయి.. ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్షలు నిర్వహిస్తారు.. పరీక్షా కేంద్రంలోకి గంటన్నర ముందే అనుమతిస్తారు... కానీ, ఒక్క నిమిషం లేటైనా నో ఎంట్రీ నిబంధన అమలు చేస్తున్నారు.
దమ్మాయిగూడ బాలాజీనగర్‌కాలనీకి చెందిన రాంచంద్రయ్య వల్లెపు డీఎస్సీ రాస్తున్నాడు. ఇక హాల్‌టికెట్ డౌన్‌లోడ్ చేసుకోగా వివరాలు సక్రమంగానే ఉన్నా ఫొటో, సంతకం మాత్రం అమ్మాయిది రావడంతో కంగుతిన్నాడు..
MEGA DSC 2024 : డీఎస్సీ 2024 నోటిఫికేషన్ ఇచ్చేందుకు ఏపీ సర్కార్ తుది కసరత్తును చేస్తోంది. రెండు రకాలుగా డీఎస్సీ నోటిఫికేషన్ ప్రభుత్వం ఇవ్వనున్నట్లు సమాచారం. గత ప్రభుత్వం చేసిన తప్పిదం వల్ల రెండు రకాలుగా నోటిఫికేషన్ ఇవ్వక తప్పని పరిస్థితి. మూడేళ్ల నుంచి టెట్ పరీక్ష నిర్వహించని గత ప్రభుత్వం వల్ల టెట్ పరీక్షల నిర్వహణతో కలిపి మెగా డీఎస్సీకి ఓ నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. టెట్ పరీక్షల్లో అర్హత పొందిన వారికి నేరుగా…