వైసీపీ ఎమ్మెల్యే ప్రభుత్వ టీచర్ ఉద్యోగం సంపాదించారు. 1998లో డీఎస్సీ రాసిన ఆయన ఎట్టకేలకు ఉపాధ్యాయుడిగా ఎంపికయ్యారు. 1998 డీఎస్సీ పోస్టింగుల కోసం అభ్యర్థులు సుమారు 23 ఏళ్లుగా ఎదురుచూస్తున్నారు. 1998 డీఎస్సీపై కోర్టులో కేసులు పెండింగ్‌లో ఉండటంతో ఇన్నాళ్లూ పోస్టింగులు వాయిదా పడుతూ వచ్చాయి. తాజాగా వివాదాలు పరిష్కారం కావడంతో సీఎం జగన్ 1998 డీఎస్సీ అభ్యర్థులకు ఉద్యోగాల కేటాయింపు ఫైలుపై సంతకం చేశారు. ఉద్యోగానికి ఎంపికైన వారి జాబితాలో వైసీపీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ…