ఇటీవల “నారప్ప” సినిమాతో ప్రేక్షకులను పలకరించిన సీనియర్ హీరో వెంకటేష్ ఈ ఏడాది మరో సినిమాతో అలరించడానికి సిద్ధమయ్యాడు. “నారప్ప” నేరుగా ఓటిటిలో విడుదల కాగా, ఆయన నటిస్తున్న తాజా చిత్రం “దృశ్యం 2” ఇప్పుడు విడుదలకు సిద్ధమవుతోంది. మలయాళ చిత్రానికి రీమేక్ గా రూపొందుతున్న”దృశ్యం 2″లో వెంకటేష్ భార్యగా మీనా నటిస్తుండగా, కృతిక, ఎస్తేర్ అనిల్ వారి కూతుర్లుగా కనిపించనున్నారు. మొదటి భాగం “దృశ్యం” బాక్సాఫీస్ వద్ద పెద్ద హిట్ కావడంతో చాలా మంది “దృశ్యం…