విశాఖపట్నంలో ఓ మందుబాబు హల్‌చల్ చేశాడు. ట్రాఫిక్ పోలీసులపై మందుబాబు వీరంగం సృష్టించాడు. విశాఖలో ట్రాఫిక్ పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తుండగా ఇద్దరు స్నేహితులు తాగి బండిపై వచ్చారు. వారిలో ఓ వ్యక్తి అక్కడి నుంచి పరారీ కాగా.. మరో వ్యక్తి పోలీసులతో వాగ్వాదానికి దిగాడు.
విశాఖపట్నం జిల్లా మధురవాడ కొమ్మాది ప్రభుత్వ మద్యం దుకాణం వద్ద ఓ వ్యక్తి వీరంగం సృష్టించాడు. మద్యం దుకాణంలో పెట్రోల్ పోసి నిప్పంటించాడు. తనకు నచ్చిన బ్రాండ్ ఇవ్వలేదని మనస్థాపంతో ఈ విధంగా వీరంగం సృష్టించినట్లు తెలిసింది.