అధికారులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా.. దేశంలోకి ఎదోవిధంగా డ్రగ్స్ వస్తూనే ఉన్నాయి. ఇటీవల కాలంలో దేశంలోని పలు విమానాశ్రయాల్లో డ్రగ్స్ తరలిస్తూ పట్టుబడుతున్నారు స్మగ్లర్లు. విదేశాల నుంచి అక్రమంగా ఇండియాలోకి డ్రగ్స్ ను తీసుకువస్తున్నారు. తాజాగా ఢిల్లీ ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. వెస్ట్ ఆఫ్రికా నుంచి ఇండియాకు వచ్చిన యువతి వద్ద నుంచి అధికారులు డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. వెస్ట్ ఆఫ్రికా నుంచి ఇండియాకు వచ్చిన యువతి వద్ద 13.26 కోట్ల…
దేశంలో రోజుకు ఎక్కడో చోట డ్రగ్స్ పట్టుబడుతూనే ఉన్నాయి. ఇటీవల కేరళ తీరంలో దాదాపుగా రూ. 1500 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టుబడ్డాయి. తాజాగా మరోసారి డ్రగ్స్ పట్టుబడ్డాయి. బెంగళూర్ అంతర్జాతీయ కార్గోలో పెద్ద ఎత్తున భారీగా ఎఫిడ్రీన్ పట్టివేశారు. 90 లక్షల విలువైన 5 కేజీల డ్రగ్స్ ను కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. ఆస్ట్రేలియాకు వెళ్తున్న పార్సిల్ లో ఈ డ్రగ్స్ ను దాచిపెట్టి అక్రమ రవాణా చేయాలని చూశారు. కస్టమ్ అధికారులకు ఏమాత్రం అనుమానం…
ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో మరోసారి భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. ఉగాండాకు చెందిన ఓ మహిళ దుబాయ్ నుండి ఢిల్లీ చేరుకుంది. అయితే ఈ లేడీ కిలాడి ప్రొఫైల్ పై అనుమానం కలగడంతో కస్టమ్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. కస్టమ్స్ అధికారులు తమదైన స్టైల్‌లో విచారణ చేయగా డ్రగ్స్ గుట్టు బయటపడింది. కస్టమ్స్ అధికారులకు ఏమాత్రం అనుమానం రాకుండా ట్రాలీ బ్యాగ్ నాలుగు పక్కల ప్రత్యేకంగా బాక్స్ లు ఏర్పాటు చేసి, అందులో 14 కోట్ల విలువ చేసే 2.2…
నేటి సమాజంలో టెక్నాలజీ పెరిగిపోయింది. రోజురోజు అత్యాధునిక సాంకేతికతతో ప్రంపచం ముందు వెళుతోంది. కానీ.. కొంతమంది యువత మాత్రం మత్తులో చిత్తవుతూ.. వారి జీవితాలను చిధ్రం చేసుకుంటున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఈ పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. ఏపీలో ఎక్కడ తనిఖీలు చేపట్టినా భారీగా గంజాయి బయటపడుతోంది. దీనిపై ప్రత్యేక దృష్టి పెట్టిన పోలీసు శాఖ బస్ స్టేషన్‌లు, రైల్వే స్టేషన్‌లను నిత్యం తనిఖీలు చేస్తూ గంజాయి రవాణాను అరికట్టేందుకు చర్యలు తీసుకుంటున్నారు. తెలంగాణలో సైతం మాదకద్రవ్యాల…