తెలుగు రాష్ట్రాల్లో సంచలనం కలిగించిన ఫుడ్డింగ్ అండ్ మింక్ పబ్ కేసులో కీలక అంశాలు బయటకు రానున్నాయి. డ్రగ్స్ కేస్ లో ఇద్దరు నిందితులైన అభిషేక్, అనిల్ మొదటి రోజు కస్టడీ విచారణ పూర్తిచేశారు బంజారాహిల్స్ పోలీసులు. పబ్ మేనేజర్ అనిల్, పార్టనర్ అభిషేక్ లను విచారణ చేశారు పోలీసులు. ఆరు గంటలు విడివిడిగా ఇద్దరిని విచారణ చేశారు పోలీసులు. అనిల్, అభిషేక్ ల వ్యక్తి గత సమాచారం సేకరించిన పోలీసులు. వాటి గురించి ఆరా తీశారు.…
విశాఖను డ్రగ్స్ మత్తు ఆవరిస్తోంది. డ్రగ్స్ పెడ్లర్స్ స్టీల్ సిటీని సేఫ్ సిటీగా భావిస్తున్నట్టు అనిపిస్తోంది. విశాఖలో డ్రగ్స్ వ్యవహారంపై యువత తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విద్యార్దులు, యువతనే టార్గెట్ చేసుకుని విశాఖ నుంచి విజయవాడ, ముంబైకి డ్రగ్స్ తరలిపోతున్నాయి. విశాఖకు చెందిన పోలీసులు పలువురు యువతను అరెస్ట్ చేశారు. నగరంలోని ఎన్‌ఏడీ జంక్షన్ వద్ద టాస్క్‌ఫోర్స్ పోలీసులు, ఎయిర్ పోర్ట్ జోన్ పోలీసులు సంయుక్తంగా దాడి జరిపి భారీగా డ్రగ్స్ ని స్వాధీనం చేసుకున్నారు.…