హైదరాబాద్‌లో డ్రగ్స్ కలకలం రేపుతున్నాయి. డ్రగ్స్ కేసుల విషయంలో విద్యార్ధులు ఎక్కువగా వున్నారని, వారిపై కేసులు నమోదు చేయాలా వద్దా అనేది ఆలోచిస్తున్నామన్నారు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్. ఓయో రూమ్‌ల్లో ప్రైవేట్ పార్టీలు జరుగుతున్నట్టు గుర్తించాం.. రూల్స్ పాటించకపోతే చర్యలు తీసుకుంటాం.. సీసీ కెమేరాలు ఉండాలి.. 6 నెలల స్టోరేజీ ఉండాలి.. ఓయో రూమ్ బుక్ చేసుకున్నప్పుడు ఐడీ కార్డు తప్పనిసరిగా తీసుకోవాలన్నారు సీపీ సీవీ ఆనంద్. యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజీ, డిగ్రీ కాలేజీలలో…