హైదరాబాద్ లోని పలు బ్లడ్ బ్యాంకులపై డ్రగ్ కంట్రోల్ బ్యూరో ఆకస్మిక సోదాలు నిర్వహించారు. సికింద్రాబాద్, మెహదీపట్నం, బాలనగర్, హిమాయత్ నగర్, లక్డీకాపూల్, మలక్ పేట్, ఉప్పల్, చైతన్యపురి, కోఠిలోని 9 బ్లడ్ బ్యాంకుల్లో తనిఖీలు చేపట్టారు. ప్రమాణాలు పాటించని 9 బ్లడ్ బ్యాంకులకు నోటీసులు జారీ చేశారు. అంతేకాకుండా.. బ్లడ్ బ్యాంకుల నిల్వ, రక్త సేకరణ పరీక్షలలో పూర్తిగా లోపాలున్నట్లు డ్రగ్ కంట్రోల్ బ్యూరో గుర్తించింది. ప్లేట్ లెట్లు, ప్లాస్మా నిల్వలో పూర్తిగా లోపాలు గుర్తించింది.…