ENG vs IND: భారత్, ఇంగ్లాండ్ మధ్య లీడ్స్ లోని హెడింగ్లీ క్రికెట్ స్టేడియంలో జరిగిన మొదటి టెస్ట్ మ్యాచ్ లో టీమిండియా 5 వికెట్లతో ఓడిపోయింది. ఇక మ్యాచ్ చివరి, ఐదవ రోజు మంగళవారం నాడు ఇంగ్లాండ్ జట్టుకు విజయంకోసం 350 పరుగులు చేయాల్సి ఉండగా, కేవలం 5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని సునాయాసంగా చేధించింది. ఇంగ్లాండ్ సెకండ్ ఇన్నింగ్స్ లో బెన్ డకెట్ 149, జాక్ క్రౌలీ 65, బెన్ స్టోక్స్ 33 పరుగులు…