Vizag: విశాఖ ద్వారాక ఆర్టీసీ కాంప్లెక్స్‌లో సోమవారం ఉదయం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. పలాస డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు బ్రేకులు పనిచేయకపోవడంతో ప్లాట్‌ఫారమ్‌పైకి దూసుకెళ్లింది. ఆ సమయంలో అక్కడ ఉన్న ప్రయాణికులను బస్సును ఢీకొట్టింది. ఈ ఘటనలో ఒక మహిళ అక్కడికక్కడే మృతి చెందగా, మరొకరికి తీవ్ర గాయాలు అయ్యాయి. అయితే, ప్రమాదానికి బ్రేక్ ఫెయిల్యూరే కారణమా లేక డ్రైవర్ నిర్లక్ష్యమా అన్న దానిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. Minister Anitha: బాబాయ్‌ను చంపిన వారికి ఓటు…
రోడ్డు ప్రమాదాలు తీవ్ర విషాదాన్ని నింపుతున్నాయి. అల్లూరి సీతారామరాజు జిల్లాలోని చింతూరు మండలంలో వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఒరిస్సాలోని భవానీపట్నం నుంచి విజయవాడ వైపు వెళ్తున్న ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ప్రమాదానికి గురైంది. ఏడుగుర్రాళ్లపల్లి మూలమలుపు వద్ద బస్ బోల్తా కొట్టింది. ప్రమాద సమయంలో బస్సులో 60 మంది ప్రయాణికులున్నట్టు పోలీసులు తెలిపారు, ఈ ఘటనలో బస్సులో ప్రయాణిస్తున్నవారిలో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందగా, 40 మందికి గాయాలయ్యాయి. మృతుల్లో ఇద్దరు చిన్నారులున్నారు.…
రోడ్లపై ప్రమాదాలు సర్వసాధారణం అయిపోయాయి. డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం పొంగూరు కండ్రిక వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. జాతీయ రహదారిపై అదుపుతప్పి పిఎస్సార్ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాద సమయంలో బస్సులో 25 మంది వరకు ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. బళ్లారి నుండి నెల్లూరు కు వెళుతుండగా జరిగిన ప్రమాదం జరిగింది.…
శ్రీకాకుళంలో విషాద ఘటన చోటు చేసుకుంది. విద్యార్థులతో పాఠశాలకు బయలు దేరిన స్కూల్ బస్సు చెరువులో పడిపోయింది. బుధవారం ఉదయం ఎచ్చెర్ల మండలంలోని కొయ్యం గ్రామ సమీపంలోని నల్ల చెరువులో ఈ ఘటన జరిగింది. 8 మంది విద్యార్థులతో వెళుతున్న స్కూల్ బస్సు చెరువులో పడిపోవడంతో.. గమనించిన స్థానికులు వెంటనే స్పందించి విద్యార్థులను కాపాడారు.. అప్పటికే ఒక విద్యార్థి మృతి చెందాడు. డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు అంటున్నారు. విద్యార్థి మృతితో ఆ…