ముంబైలో హీరోయిన్ ఊర్మిళ కొఠారే కారు శుక్రవారం రాత్రి బీభత్సం సృష్టించింది. ఈ ప్రమాదంలో మెట్రో ప్రాజెక్ట్‌లో పని చేస్తున్న కార్మికుడు మృతిచెందాడు. అతివేగంగా కారు నడపడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. ఊర్మిళా కొఠారే డ్రైవర్ కారును అత్యంత వేగంగా నడిపాడని పోలీసులు పేర్కొన్నారు.
మహారాష్ట్ర పూణెలోని ఓ ఆటోరిక్షా డ్రైవర్‌పై గురువారం నాడు 18 ఏళ్ల యువతిని వేధింపులకు గురిచేసి, ముద్దుపెట్టుకున్నందుకు కేసు నమోదు చేశామని, అతన్ని ఇంకా అరెస్టు చేయలేదని పోలీసులు తెలిపారు.