AV Ranganath : హైడ్రా నిర్వహించే సేవలలో డీఆర్‌ఎఫ్ (DRF) బృందాల పాత్ర అత్యంత కీలకమని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ తెలిపారు. ప్రభుత్వ లక్ష్యాలు, ప్రజల అంచనాలను నెరవేర్చే విధంగా హైడ్రా కార్యకలాపాలు ఉండాలని సూచించారు. ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉంటూ బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాల్సిన అవసరముందని పేర్కొన్నారు. గురువారం డీఆర్‌ఎఫ్‌లో ఔట్‌సోర్సింగ్ విధానంలో కొత్తగా నియమితులైన 357 మంది శిక్షణ ప్రారంభోత్సవంలో కమిషనర్ రంగనాథ్ ప్రసంగించారు. అంబర్‌పేట పోలీసు శిక్షణ కేంద్రంలో వీరికి ఒక…