ఉపరితలం నుంచి ఉపరితలానికి ప్రయోగించగల, దేశీయంగా అభివృద్ధి చేసిన’ప్రళయ్’ క్షిపణిని బుధవారం ఒడిశా తీరంలో అబ్దుల్ కలామ్ దీవి నుండి డీఆర్‌డీఓ విజయవంతంగా ప్రయోగించింది. ”ఈ ప్రయోగంతో అన్ని లక్ష్యాలు నేరవేరాయి. కొత్త క్షిపణి ఆశించిన రీతిలోనే పాక్షిక క్షిపణి పథాన్ని (క్వాసి బాలిస్టిక్ ట్రాజెక్టరీ) అనుసరించింది. నిర్దేశిత లక్ష్యాన్ని ఖచ్చితమైన వేగంతో చేరుకుంది. అన్ని ఉప వ్యవస్థలు సంతృప్తికరంగా పనిచేశాయి.” అని డీఆర్‌డీఓ ఓ ప్రకటనలో పేర్కొంది. ఈ క్షిపణి 150-500 కిలోమీటర్ల పరిధిలోని లక్ష్యాలను…
తమిళనాడులో జరిగిన హెలికాప్టర్ ప్రమాదం దేశవ్యాప్తంగా విషాదం నింపింది. త్రివిధదళాల అధిపతి జనరల్ బిపిన్ రావత్ మరణం దురదృష్టకరం అన్నారు రక్షణ శాఖ కార్యదర్శి, భారత రక్షణ పరిశోధన, అభివృధ్ద సంస్థ ఛైర్మన్ డా.జి.సతీష్ రెడ్డి. జనరల్ రావత్ సుమారు 209 రక్షణ పరికరాలను స్వదేశీ పరిజ్ఞానం తో రూపొందించాలని ఓ జాబితా ను సిధ్దం చేశారు. త్రివిధ దళాలను సంఘటితం చేసి మరింత పటిష్టంగా రక్షణ దళ వ్యవస్థను సాంకేతికంగా అభివృధ్ది చేయాలన్నదే ప్రభుత్వ సంకల్పం.…
భారత రక్షణ పరిశోధన సంస్థ (డీఆర్‌డీవో) దేశీయంగా అభివృద్ధి చేసిన స్మార్ట్ యాంటీ ఎయిర్‌ఫీల్డ్ వెపన్ ను ఇండియాన్ ఎయిర్‌ఫోర్స్‌తో కలిసి విజయవంతంగా పరీక్షించాయి. వంద కిలోమీటర్ల దూరంలో ఉన్న శత్రువుల బంకర్లు, రాడార్లతో పాటు రన్‌వేలు, ఎయిర్ క్రాఫ్ట్ హ్యాంగర్లను, రీన్ ఫోర్స్ నిర్మాణాలను ఈ మిస్సైల్ ధ్వంసం చేస్తుంది. దీనిలో ఉన్న ఎలక్ట్రో ఆప్టికల్, శాటిలైట్ నావిగేషన్ సెన్సార్ల ఆధారంగా రెండు వేర్వేరు కాన్ఫిగరేషన్లను విజయవంగా పరీక్షించినట్లు అధికారులు తెలిపారు. శాస్త్రవేత్తలు ఐఐఆర్ (ఇమేజింగ్…
గత కొన్ని రోజులుగా పాక్ భూభాగం నుంచి డ్రోన్‌లు రహస్యంగా భారత్ భూభాగంలోకి వచ్చి ఇబ్బందులు పెడుతున్న సంగతి తెలిసందే. జమ్మూకాశ్మీర్‌లోని వైమానిక స్థావరంపై డ్రోన్ దాడి తరువాత, భారత బలగాలు అప్రమత్తం అయ్యాయి. భద్రతను మరింత కట్టుదిట్టం చేశాయి. అయినప్పటికీ నిత్యం జమ్మూకాశ్మీర్ సరిహద్దుల్లో పాక్ డ్రోనులు కలకలం సృష్టిస్తున్నాయి. దీంతో ఈ డ్రోన్‌లకు చెక్ పెట్టేందుకు డీఆర్‌డీఓ రంగంలోకి దిగింది. Read: మేకింగ్ వీడియో : “రోర్ ఆఫ్ ఆర్ఆర్ఆర్” ఎలా ఉందంటే..?…
కరోనా సెకండ్ వేవ్ తగ్గుముఖం పడుతున్నా.. ఇప్పుడు థర్డ్ వేవ్ ముప్పు పొంచిఉందనే హెచ్చరికలు కలవరపెడుతున్నాయి.. ఈ తరుణంలో వ్యాక్సినేషన్, ఇతర మందులపై అందరి దృష్టి ఉంటుంది… ఇక, ఇదే సమయంలో డీఆర్డీవో రూపొందించిన 2 జీడీ ఔషధాన్ని ఇప్పటికే మార్కెట్‌లోకి విడుదల చేసింది కేంద్ర ప్రభుత్వం.. దీనిని డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్ సప్లై చేస్తోంది.. పొడి రూపంలో ఉండీ ఈ ఔషధాన్ని ఎలా వాడాలి..? ఎవరు? వాడాలి.. తదితర అంశాలపై గైడ్‌లైన్స్ విడుదల చేసింది డీఆర్జీవో..…
కరోనాకు చెక్ పెట్టేందుకు క్రమంగా కొత్త వ్యాక్సిన్లు, మందులు అందుబాటులోకి వస్తూనే ఉన్నాయి.. ఇప్పటికే భారత రక్షణ సంస్థ డీఆర్డీవో భాగస్వామ్యంతో కోవిడ్ బాధితుల చికిత్స కోసం 2డీజీ డ్రగ్ ను తయారు చేయగా.. తాజాగా.. 2డీజీ డ్రగ్‌ను డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్ ఆవిష్కరించింది. పౌడర్ రూపంలో ఉండే సాచెట్‌ను విడుదల చేసింది డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్.. 10వేల మోతాదుల మొదటి బ్యాచ్‌ను వచ్చే వారంలో అందుబాటులోకి తీసుకురానున్నట్టు ఈ సందర్భంగా వెల్లడించారు. ఇక, 2-డియోక్సీ-డీ-గ్లూకోజ్ (2-డీజీ)…