రక్షణ శాఖకు అత్యాధునిక ఆయుధాలను తయారు చేసివ్వడంలో అద్భుతమైన ప్రగతి సాధించామని డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్ మెంట్ ఆర్గనైజేషన్ (DRDO) చైర్మన్ డాక్టర్ సమీర్ వి. కామత్ పేర్కొన్నారు.
Akash Missile: భారత అమ్ములపొదిలో మరో అస్త్రం చేరింది. ఒడిశా తీరంలోని చాందీపూర్ ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్(ఐటిఆర్) నుండి న్యూజనరేషన్ ఆకాష్ క్షిపణిని శుక్రవారం విజయవంతంగా ప్రయోగించిందని అధికారులు తెలిపారు. డీఆర్డీఓ అధికారులు ఈ పరీక్షను నిర్వహించారు. తక్కువ ఎత్తులో మానవరహిత వైమానిక లక్ష్యాన్ని ఛేదించేలా ఫ్లైట్ టెస్ట్ జరిగింది. ఆకాష్ ఆయుధ వ్యవస్థలోని అన్ని విభాగాలు అత్యంత ఖచ్చితత్వంలో పనిచేశాయని అధికారులు వెల్లడించారు.
High-Speed Flying-Wing UAV: డీఆర్డీవో శుక్రవారం కర్ణాటకలోని చిత్రదుర్గలో ఏరోనాటికల్ టెస్ట్ రేంజ్ (ATR) నుండి అటానమస్ ఫ్లయింగ్ వింగ్ టెక్నాలజీ డెమాన్‌స్ట్రేటర్‌ను విజయవంతంగా పరీక్షించింది.
డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్‌డీవో)కి ఆదివారం ఓ చేదువార్త ఎదురైంది. కర్ణాటకలోని చిత్రదుర్గ జిల్లాలో గల ఓ గ్రామంలో డీఆర్‌డీవో అభివృద్ధి చేసిన తపస్ డ్రోన్ పరీక్షిస్తుండగా కూలిపోయింది.
Honey Trap: భారతదేశ రహస్యాలను తెలుసుకోవడానికి పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు హనీట్రాప్ ని ఉపయోగిస్తున్నాయి. ఇప్పటికే డీఆర్డీఓలో పనిచేస్తున్న ఓ సైంటిస్టు సున్నితమైన భారత మిస్సైల్ రహస్యాలను ఓ పాకిస్తాన్ మహిళా ఏజెంట్ లో పంచుకున్నారు. అతడిని అరెస్ట్ చేసి విచారిస్తున్న సమయంలో ఈ విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఇదిలా ఉంటే తాజాగా మరో హనీట్రాప్ కేసు వెలుగులోకి వచ్చింది.
Honey Trap Case: డీఆర్డీఓ శాస్త్రవేత్త ప్రదీప్ కురుల్కర్ పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ వలపువలతో చిక్కుకున్నాడు. ప్రస్తుతం అతడిని అధికారులు విచారిస్తున్నారు. అయితే విచారణలో విస్తూ పోయే నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. జరా దాస్‌గుప్తా అనే పేరుతో ప్రదీప్ కురుల్కర్ ను హనీట్రాప్ చేశారు.
Agni Prime Ballistic Missile: భారత అమ్ములపొదిలో మరో అస్త్రం చేరింది. కొత్త తరం బాలిస్టిక్ క్షిపణి అగ్ని ప్రైమ్‌ను తొలిసారిగా పరీక్షించారు. డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (డిఆర్‌డిఓ) బుధవారం ఒడిశా తీరంలోని డాక్టర్ ఎపిజె అబ్దుల్ కలాం ద్వీపం నుండి విజయవంతంగా పరీక్షించింది. గురువారం డీఆర్డీఓ ఈ విషయాన్ని అధికారికంగా వెల్లడించింది. మిస్సైల్ నిర్దేశించిన లక్ష్యాన్ని విజయవంతంగా ఛేదించింది.
Indian Navy: హిందూ మహాసముద్ర ప్రాంతంలో పెరుగుతున్న చైనా ముప్పును ఎదుర్కొనేందుకు భారత నౌకాదళం తనను తాను బలోపేతం చేసుకునే పనిలో నిమగ్నమై ఉంది. అవసరమైతే శత్రువులకు తగిన సమాధానం చెప్పేందుకు భారత నావికాదళం తన ఆయుధాలను, మందుగుండు సామగ్రిని నిరంతరం పెంచుకుంటూ పోతోంది.
honeytrap: దాయాది దేశం పాకిస్తాన్ భారత్ పై చేస్తున్న కుట్రలు చేస్తూనే ఉంది. ఇప్పటికే కొందరు భారత సైనికులతో పాటు అధికారులను హనీట్రాప్ ముగ్గులోకి దించిన ఘటనలు వెలుగులోకి వచ్చాయి. ఇంటెలిజెన్స్ సంస్థలు ముందుగానే పసిగట్టి వారిని అరెస్ట్ చేశాయి.