డాక్టర్ రాజశేఖర్ టైటిల్ రోల్ ప్లే చేస్తున్న సినిమా ‘శేఖర్’. మలయాళ చిత్రం ‘జోసఫ్’కు రీమేక్ అయిన ఈ మూవీని జీవిత డైరెక్ట్ చేశారు. ఈ నెల 20న ‘శేఖర్’ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సందర్భంగా ఆమె ఆదివారం మీడియాతో మాట్లాడారు. తమిళ సూపర్ హిట్ చిత్రం ‘శేషు’ను తెలుగులో రీమేక్ చేయాలని అనుకున్నప్పుడు పలువురు దర్శకులు కథలో మార్పులు చేర్పులూ చేయాలని సలహా ఇవ్వడంతో అది ఇష్టంలేక తానే తొలిసారి మెగా ఫోన్ పట్టుకున్నానని…
యాంగ్రీ స్టార్ రాజశేఖర్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా సినిమా ‘శేఖర్’. ‘మ్యాన్ విత్ ద స్కార్’ అనేది ఉపశీర్షిక. లలిత్ దర్శకత్వం వహిస్తున్నారు. లక్ష్య ప్రొడక్షన్స్, పెగాసస్ సినీ కార్ప్ పతాకాలపై ఎమ్.ఎల్.వి. సత్యనారాయణ, శివాని, శివాత్మిక, వెంకట శ్రీనివాస్ బొగ్గరం నిర్మిస్తున్నారు. అరకులో బుధవారం తాజా షెడ్యూల్ మొదలైంది. దీంతో 75 శాతం చిత్రీకరణ పూర్తి కానుంది. దర్శకుడు లలిత్ మాట్లాడుతూ “కరోనా సెకండ్ వేవ్ కారణంగా చిత్రీకరణకు విరామం వచ్చింది. ఈ రోజు అరకులో…