మన వంటకాలలో సాధారణంగా చక్కెర, బెల్లం రెండింటినీ ఉపయోగిస్తుంటాం. కొందరు బెల్లం ఆరోగ్యానికి మంచిదని, చక్కెర మాత్రం అంత మంచిది కాదని అంటుంటారు. అయితే ఈ మాటలన్నిటిని గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్ పాల్ మాణిక్యం తిప్పికొడుతున్నారు. బ్రౌన్ షుగర్ (బెల్లం) కానీ, తెల్ల చక్కెర కానీ—రెండూ తేడా లేకుండా ఒక్కటేనని ఆయన స్పష్టం చేస్తున్నారు. కాలిఫోర్నియాలోని ఒక క్లినిక్‌లో సర్టిఫైడ్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్‌గా, అలాగే ప్రివెంటివ్ గ్యాస్ట్రోఎంటరాలజీ డైరెక్టర్‌గా పనిచేస్తున్న డాక్టర్ పాల్ మాణిక్యం ఇటీవల ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక వీడియో…