పాముతో కాటు వేయించి భార్యను హత్య చేసిన కేసులో కేరళ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది.. మృతురాలు భర్త సూరజ్‌కు రెండు జీవిత ఖైదులను విధించింది.. తన భార్యను హత్య చేసిన కేసులో భర్త సూరజ్‌ను గత సోమవారం దోషిగా తేల్చిన కోర్టు.. ఇవాళ శిక్ష ఖరారు చేసింది. తీర్పు వెలువరించే సందర్భంగా సెషన్స్ కోర్టు న్యాయమూర్తి జస్టిస్ మనోజ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇది అత్యంత అరుదైన కేసు.. ఈ నేరానికి దోషికి మరణశిక్ష విధించాలి..…