Increments in India: లేచింది మొదలు.. పడుకునే వరకు.. లేఆఫ్ వార్తలతో నీరసించిపోతున్న ప్రైవేట్ సంస్థల ఉద్యోగులకు ఒక శుభవార్త. ఈ ఏడాది శాలరీలు పది శాతానికి పైగానే పెరగనున్నాయి. 46 శాతం సంస్థలు ఈ సంవత్సరం.. ఉద్యోగుల వేతనాలను రెండంకెల శాతం పెంచాలని భావిస్తున్నాయి. కనీసం 10 పాయింట్ 3 శాతం ఇంక్రిమెంట్ ఇవ్వాలని అనుకుంటున్నాయి. టెక్నాలజీ రంగంలో 12 పాయింట్ 9 శాతం, ఇ-కామర్స్ సెక్టార్‌లో 12 పాయింట్ 2 శాతం హైక్స్ ఇవ్వనున్నాయి.