దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న సినిమా ‘ఆర్ఆర్ఆర్’. ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా అలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమా మీద భారీ అంచనాలు నెలకొన్నాయి. “ఆర్ఆర్ఆర్” కొమరం భీమ్, అల్లూరి సీతారామరాజు జీవితాలను ఆధారంగా చేసుకుని తెరకెక్కుతున్న ఒక కల్పిత కథ. డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ పాన్-ఇండియా ప్రాజెక్టు గురించి ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. అయితే… తాజాగా ఈ మూవీ నుంచి అదిరిపోయే అప్డేట్ వచ్చింది.…