గార్దబాలు గుడి చుట్టూ తిరిగి అమ్మవారి మొక్కులు తీర్చాయి. మీరు వింటున్నది నిజమే గాడిదలు ఉగాది ఉత్సవాల్లో పాల్గొని అమ్మవారి మొక్కులు చెల్లించాయి. కర్నూలు జిల్లా కల్లూరు చౌడేశ్వరి ఆలయంలో వినూత్న రీతిలో ఉత్సవాలు నిర్వహిస్తారు. ఉగాది రోజున అందరూ కొత్త బట్టలు వేసుకొని పూజలు చేసి మొక్కు తీర్చుకుంటే చౌడేశ్వరి ఆలయంలో గాడిదలు, ఎడ్లబండ్లతో ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు. అది బురదమట్టిలో గాడిదలతో ప్రదక్షిణలు చేయించడం ఇక్కడి ఆనవాయితీ. కర్నూలు జిల్లా కల్లూరులో ఉగాది…