అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన డొనాల్డ్ ట్రంప్ క్రమంగా తన టీమ్‌ను ఏర్పాటు చేసుకునే పనిలో పడ్డారు. ఈ నేపథ్యంలో మైక్ వాల్ట్జ్‌ని తన జాతీయ భద్రతా సలహాదారుగా నియమించుకున్నారు. యూఎస్ సెనేట్‌లోని ఇండియా కాకస్ అధిపతి వాల్ట్జ్, అమెరికా కోసం బలమైన రక్షణ వ్యూహాన్ని సమర్థించారు.