అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఇటీవలి కాలంలో కఠినమైన సుంకాల విధానాన్ని ప్రకటించారు. అనేక దేశాలతో వాణిజ్యంపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. అమెరికా వెలుపల ఐఫోన్‌లను తయారు చేస్తే 25 శాతం దిగుమతి సుంకం చెల్లించాల్సి ఉంటుందని ట్రంప్ ఆపిల్‌ను హెచ్చరించాడు. ఈ నేపథ్యంలో సుంకాలపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నుంచి కొత్త ప్రకటన వెలువడింది. దేశీయంగా యుద్ధ ట్యాంకులు, సాంకేతిక ఉత్పత్తుల తయారీని ప్రోత్సహించడమే తన టారిఫ్ విధానం అని ఆయన స్పష్టంగా…