జమ్మూ కశ్మీర్‌లోని ఉధంపూర్ జిల్లాలో హృదయ విదారక హత్య కేసు వెలుగులోకి వచ్చింది. చెనాని ప్రాంతంలోని లడ్డా గ్రామంలో ఓ సంచిలో కుళ్ళిన స్థితిలో మృతదేహం లభ్యమైంది. మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. దర్యాప్తులో ఓ షాకింగ్ విషయం బయటపడింది. భర్తను భార్య, ఆమె కుటుంబ సభ్యులతో కలిసి దారుణంగా హత్య చేసినట్లు తేలింది. ఈ సంఘటన గురువారం జరిగింది. పోలీసులు ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు.