స్టాక్‌మార్కెట్లు శుక్రవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. వరుస నష్టాల మధ్య మార్కెట్లలో ఉపశమన ర్యాలీ కనిపిస్తోంది. గ్లోబల్ మార్కెట్ల నుంచి సానుకూలతలు ఈ ర్యాలీకి కారణమయ్యాయి. మరోవైపు 10 ఏళ్ల బాండ్ల రాబడులు రెండువారాల కనిష్ఠానికి చేరడం, అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు దిగిరావడం సూచీలకు కలిసొస్తోంది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.78.16 వద్ద కొనసాగుతోంది. ఈ పరిణామాల మధ్య ఉదయం 10 గంటల సమయంలో సెన్సెక్స్ 398 పాయింట్ల లాభంతో 52663 వద్ద,…