ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటై ఐదు నెలలు గడిచిందని, ఎవరి మీద కక్ష సాధింపు చర్యలు చేపట్టలేదని మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి అన్నారు. గత ప్రభుత్వ నాయకులు ఐదేళ్లలో చాలా దారుణాలు చేశారన్నారని, ఆరోజు మూగబోయిన గొంతులు ఈరోజు వస్తున్నాయన్నారు. తప్పు చేసిన వాళ్లు ఎవరైనా, ఎంతటి హోదాలో ఉన్నా తప్పించుకోలేరని హెచ్చరించారు. వైసీపీ నాయకులు నష్ట నివారణ కోసం ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడుతున్నారని మంత్రి డోలా ఎద్దేవా చేశారు. Also Read: CM…
గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వెలిగొండ ప్రాజెక్టుకు ఫేక్ ప్రారంభోత్సవం చేశారని దుయ్యబట్టారు మంత్రి డోలా బాల వీరాంజనేయస్వామి.. మంత్రులు నిమ్మల రామానాయుడు.. గొట్టిపాటి రవికుమార్‌తో కలిసి వలిగొండ ప్రాజెక్టును పరిశీలించిన తర్వాత మీడియాతో మాట్లాడిన ఆయన.. వెలిగొండ ప్రాజెక్టును గతంలో ముఖ్యమంత్రి చంద్రబాబు శంకుస్థాపన చేశారు.. ఆయనే పూర్తి చేసి ప్రారంభిస్తారని తెలిపారు..