Hyderabad: గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో చిన్న పిల్లలపై కుక్క కాట్ల ఘటనలు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. మంగళవారం నాడు హయత్‌నగర్‌లో ప్రేమ్‌చంద్ అనే చిన్నారిపై వీధి కుక్కలు దాడి చేయడంతో తీవ్రంగా గాయపడ్డాడు.
Prayagraj Stray Dog Crisis: ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ప్రయాగ్‌రాజ్ నగరంలో వీధికుక్కల సంఖ్య 1 లక్ష 15 వేలు దాటింది. ప్రతి నెలా నాలుగు వేలకు పైగా కుక్క కాటు సంఘటనలు జరుగుతున్నాయి. వీధికుక్కల కారణంగా ప్రతి నెలా వందలాది రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. గత వారం.. ద్విచక్ర వాహనంపై వెళ్తున్న బ్యాంకు మేనేజర్‌ను ఒక వీధికుక్క వెంబడించింది. తప్పించుకుని పారిపోతుండగా.. మున్సిపల్ చెత్త ట్రక్కు కింద పడి మృతి చెందాడు. ఈ ఘటన ఒక్కసారిగా నగరంలో…
Karimnagar: రాష్ట్రంలో కుక్కల దాడులు విపరీతంగా జరుగుతున్నాయి. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా రోడ్లపై దొరికిన వారిపై దాడులు చేస్తూ భీభత్సం సృష్టిస్తున్నారు.
Pitbull: పలు విదేశీ కుక్క జాతులను నిషేధించాలని కేంద్రం సిఫార్సు చేసింది. పెటా ఇండియా అభ్యర్థన తర్వాత ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఇల్లిగల్ ఫైటింగ్, దాడులకు ఎక్కువగా ఉపయోగించే విదేశీ కుక్క జాతుల అమ్మకం, పెంపకం లేదా వాటిని కలిగి ఉండటంపై నిషేధం విధించాలని కేంద్రం రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ప్రధాన కార్యదర్శులకు బుధవారం లేఖ రాసింది. మానవుకులు ప్రమాదాలను తీసుకువస్తున్న పిట్ బుల్స్ వంటి ప్రమాదకరమైన జాతులను నిషేధించాలని కేంద్రం భావిస్తోంది.
Dog attacks: తెలంగాణలో వీధికుక్కల స్వైర విహారం ఎక్కువైంది. వీధుల్లో తిరుగుతూ ప్రజలపై దాడులు చేస్తున్నారు. వీధికుక్కల దాడి వల్ల చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ప్రధానంగా చెప్పాలంటే పిల్లలు వీధికుక్కల దాడులకు గురవుతున్నారు.
తెలంగాణ రాష్ట్రంలో చిన్నారులపై కుక్కల దాడులు హడలెత్తుస్తున్నాయి. నిన్న అంబర్ పేట్ పోలీస్టేషన్ పరిధిలో చిన్నారిపై కుక్కలు దాడి చేసి చంపేసిన ఘటన మరువక ముందే మరో ఇద్దరు చిన్నారులపై కుక్కలదాడి భయాందోళన కలిగిస్తుంది.
కస్టమర్‌కు ఫుడ్ ఆర్డర్ ఇవ్వడానికి వెళ్లిన ఓ డెలివరీ బాయ్ మర్మాంగంపై కుక్క కాటు వేసిన ఘటన మహారాష్ట్రలోని థానేలో జరిగింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారడంతో నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.