కుక్కకి పట్టెడన్నం పెడితే చాలు ప్రాణం పోయేవరకు విశ్వాన్ని చూపిస్తుంది. ఆ విశ్వాసం కారణంగానే గ్రామసింహం అనే పేరుని సంపాదించింది శునకం. ఆకలి తీర్చిన వారిపైన విశ్వాసాన్ని చూపడమే కాదు మంచిగా శిక్షణ ఇస్తే శునకం చెయ్యని పనంటూ ఉండదు. అందుకే దేశ భద్రత వ్యవస్థలలో కూడా శునకాన్ని అగ్రతాంబూలం ఇస్తారు.