Co-inventor of DLS method Frank Duckworth Dead: డక్‌వర్త్ క్రికెట్ గణాంక నిపుణుడు, డక్‌వర్త్ లూయిస్ స్టెర్న్ (డీఎల్ఎస్) పద్ధతి సహ సృష్టికర్త ఫ్రాంక్ డక్‌వర్త్ మృతి చెందారు. ఆయన వయసు 84. వృద్ధాప్య సమస్యలతో జూన్ 21న ఫ్రాంక్ డక్‌వర్త్ తుదిశ్వాస విడిచారు. డక్‌వర్త్ మరణవార్త కాస్త ఆలస్యంగా బయటకు వచ్చింది. అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) మంగళవారం ఆయన మరణవార్తను ద్రువీకరించింది. ఫ్రాంక్ డక్‌వర్త్ మరణం పట్ల క్రికెటర్లు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.…