Frank Duckworth Death: ‘డక్‌వర్త్ లూయిస్’ రూపకర్త ఫ్రాంక్ డక్‌వర్త్ మృతి!
- డీఎల్ఎస్ పద్ధతి సహ సృష్టికర్త మృతి
- 2001లో డీఎల్‌ఎస్ పద్ధతి
- లూయిస్ 2020లో కన్నుమూత
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Co-inventor of DLS method Frank Duckworth Dead: డక్‌వర్త్ క్రికెట్ గణాంక నిపుణుడు, డక్‌వర్త్ లూయిస్ స్టెర్న్ (డీఎల్ఎస్) పద్ధతి సహ సృష్టికర్త ఫ్రాంక్ డక్‌వర్త్ మృతి చెందారు. ఆయన వయసు 84. వృద్ధాప్య సమస్యలతో జూన్ 21న ఫ్రాంక్ డక్‌వర్త్ తుదిశ్వాస విడిచారు. డక్‌వర్త్ మరణవార్త కాస్త ఆలస్యంగా బయటకు వచ్చింది. అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) మంగళవారం ఆయన మరణవార్తను ద్రువీకరించింది. ఫ్రాంక్ డక్‌వర్త్ మరణం పట్ల క్రికెటర్లు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
మ్యాచ్‌కు వరుణుడు అంతరాయం కలిగించిన సందర్భాల్లో డీఎల్ఎస్ పద్దతి ద్వారా ఫలితాన్ని నిర్ణయిస్తారన్న విషయం తెలిసిందే. టోనీ లూయిస్‌తో కలిసి డీఎల్‌ఎస్ పద్ధతిని ఫ్రాంక్ డక్‌వర్త్ రూపొందించారు. డీఎల్‌ఎస్ పద్ధతిని ఐసీసీ 1997లో తొలిసారిగా అమలు చేసింది. వర్షప్రభావిత మ్యాచ్‌ల్లో లక్ష్యాల్ని నిర్ణయించడానికి 2001లో డీఎల్‌ఎస్ పద్ధతిని ఐసీసీ ప్రామాణికంగా తీసుకుంది. అయితే ఈ డీఎల్‌ఎస్ పద్ధతిలో ఆస్ట్రేలియాకు చెందిన గణాంక నిపుణుడు స్టీవెన్ స్టెర్న్ కొన్ని మార్పులు చేశారు. ఆ తర్వాత ఈ పద్ధతికి డక్‌వర్త్ లూయిస్ స్టెర్న్ (డీఎల్ఎస్)గా నామకరణం చేశారు. లూయిస్ 2020లో కన్నుమూయగా.. తాజాగా ఫ్రాంక్ డక్‌వర్త్ తుదిశ్వాస విడిచారు.
Also Read
- Pujara Playing XI: వెస్టిండీస్‌తో టీ20 సిరీస్.. వైభవ్ సూర్యవంశీకి దక్కని చోటు..
- AP Govt: రేపు ఏపీలో ‘అమరజీవి జలధార’కు శ్రీకారం.. 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు..
- VIVO Smart Phones: 6.59 అంగుళాల OLED డిస్ప్లే, 7000mAh బ్యాటరీ, 90W ఫాస్ట్ ఛార్జింగ్.. VIVO నుంచి రెండు స్మార్ట్ ఫోన్స్..
- Oppo F35 Series: 8000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్.. మార్కెట్‌లోకి Oppo నుంచి రెండు స్మార్ట్ ఫోన్స్..
Also Read: Nokia 3210: భారత మార్కెట్‌లోకి ‘నోకియా 3210’ ఫోన్.. యూపీఐ, యూట్యూబ్ ఫీచర్స్ కూడా!
2014లో ఫ్రాంక్ డక్‌వర్త్ క్రికెట్‌కు దూరమయ్యారు. 2014లో పదవీ విరమణ చేసే ముందువరకు ఐసీసీలో కన్సల్టెంట్ స్టాటిస్టిషియన్‌గా ఉన్నారు. అతను క్రీడకు చేసిన సేవలకు 2010లో ‘ఆర్డర్ ఆఫ్ ది బ్రిటిష్ ఎంపైర్’ మెంబర్ ఆఫ్ గౌరవాన్ని అందుకున్నారు. ఫ్రాంక్ డక్‌వర్త్ మరణించినా.. అతడి పేరు మాత్రం క్రికెట్ చరిత్రలో మిగిలిపోనుంది.
తాజావార్తలు
-
Chanchalguda Jail : చంచల్‌గూడ జైలు సూపరింటెండెంట్‌పై ఆరోపణలు.. జైళ్ల శాఖ క్లారిటీ
-
Thackeray Brothers: ఠాక్రే బ్రదర్స్ ‘విరాట్ గర్జన’.. ఎన్నికల సంఘంపై విపక్షాల ఉమ్మడి పోరాటం!
-
Pujara Playing XI: వెస్టిండీస్‌తో టీ20 సిరీస్.. వైభవ్ సూర్యవంశీకి దక్కని చోటు..
-
LPG Subsidy: సిలిండర్ బుక్ చేసుకునేవారికి శుభవార్త.. రూ.300 సబ్సిడీకి కేంద్రం గ్రీన్ సిగ్నల్!
-
Janhvi Kapoor: వీడియోలు లైంగిక దాడితో సమానం”: జాన్వీ కపూర్ సంచలన పోస్ట్
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!