Yogi Adityanath: దీపావళికి ముందు, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆందోళనకారులకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. పండుగ వాతావరణాన్ని దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తే జైలు పాలు కావడం ఖాయమన్నారు. ఎంతటి వారైనా చర్యలు తప్పవని.. వెంటనే జైలులో పెడతామని హెచ్చరించారు. పండుగలు, వేడుకలను శాంతియుతంగా, సామరస్యంగా జరుపుకోవాలని సీఎం యోగి సూచించారు. గత ఎనిమిది సంవత్సరాలుగా ఉత్తరప్రదేశ్‌లోని అన్ని సమాజిక వర్గాలకు చెందిన ప్రజలు పండుగలను శాంతియుతంగా జరుపుకున్నారన్నారు. ఇది అల్లర్లకు తలొగ్గే ప్రభుత్వం కాదన్నారు.