దీపావళి అంటేనే గుర్తొచ్చేది విద్యుత్ దీపాలు.. కొత్త బట్టలు.. రకరకాలైన స్వీట్లు. సందడి.. సందడి వాతావరణం. ఇంటిల్లిపాది టపాసులు కాల్చడం.. ఇలా దీపావళికి ఎన్నెన్నో కొత్త సంగతులు ఉంటాయి. ఇవన్నీ ఒకెత్తు అయితే.. రకరకాలైన పిండి వంటలు చేసుకోవడం ఆనవాయితీ.
కుల, మత బేధం లేకుండా, చిన్నా, పెద్దా అని వయస్సుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు జరుపుకొనే పండుగ దీపావళి.. నేడు ప్రపంచ వ్యాప్తంగా ఈ పండగను ప్రజలు అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నారు.. టపాసులు ఈ పండుగకు ప్రత్యేకంగా నిలిస్తే.. మిఠాయిలకు కూడా దీపావళికి ప్రత్యేక స్థానం ఉంది.. బంధువులకు ఆత్మీయులకు స్వీట్స్ ను తినిపించి తియ్యని వేడుకను చేసుకుంటారు.. ఈ పండుగలను క్యాష్ చేసుకోవడం కోసం కొందరు కేటుగాళ్ళు తెగ ప్రయత్నాలు చేస్తారు.. స్వీట్లకు డిమాండ్…