కుల, మత బేధం లేకుండా, చిన్నా, పెద్దా అని వయస్సుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు జరుపుకొనే పండుగ దీపావళి.. నేడు ప్రపంచ వ్యాప్తంగా ఈ పండగను ప్రజలు అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నారు.. టపాసులు ఈ పండుగకు ప్రత్యేకంగా నిలిస్తే.. మిఠాయిలకు కూడా దీపావళికి ప్రత్యేక స్థానం ఉంది.. బంధువులకు ఆత్మీయులకు స్వీట్స్ ను తినిపించి తియ్యని వేడుకను చేసుకుంటారు..
ఈ పండుగలను క్యాష్ చేసుకోవడం కోసం కొందరు కేటుగాళ్ళు తెగ ప్రయత్నాలు చేస్తారు.. స్వీట్లకు డిమాండ్ పెరిగినప్పుడు నకిలీ స్వీట్ల సరుకులు మార్కెట్‌లోకి రావడం ప్రారంభమవుతుంది. మార్కెట్‌లో లభించే ఈ నకిలీ రసాయన ఆధారిత స్వీట్లు ఆరోగ్యానికి మంచిది కాదు. వీటిని తీసుకోవడం వల్ల తీవ్రమైన వ్యాధుల బారిన పడే అవకాశం ఉంది. అందువల్ల కల్తీ మిఠాయిలను కొనుగోలు చేసే ముందు వాటిని తనిఖీ చేయడం చాలా ముఖ్యం. ఎందుకంటే ఇది ఆరోగ్యానికి తీవ్రమైన ముప్పు కలిగిస్తుంది. వీటి వల్ల నోటి క్యాన్సర్, కిడ్నీ వ్యాధులు వచ్చే ప్రమాదం పెరుగుతుంది.. అందుకే మీరు బయట స్వీట్స్ ను కొనుగోలు చేస్తుంటే మాత్రం కాస్త జాగ్రత్తగా ఉండాలి..
ఈ స్వీట్స్ లలో ఖోయా, బంగాళదుంప, అయోడిన్, డిటర్జెంట్, సింథటిక్ మిల్క్, వైట్‌నర్, సుద్ద, యూరియా ఇలా రకరకాల రసాయనాలతో స్వీట్‌లను తయారు చేసి ఈ స్వీట్‌లను అలంకరించేందుకు సిల్వర్ వర్క్‌కు బదులు అల్యూమినియం వర్క్‌ను ఉపయోగిస్తున్నారు. తీవ్రమైన అనారోగ్యానికి కారణమవుతుంది. అందువల్ల దీపావళి రోజున మిఠాయిలు కొనుగోలు చేసేటపుడు వాటి తయారీ పై శ్రద్ద వహించడం మంచిది.. కల్తీ స్వీట్లలో ఉండే స్టార్చ్, అసంతృప్త కొవ్వు శరీరంలోని కొలెస్ట్రాల్ స్థాయిని పెంచుతుంది. దీని కారణంగా గుండెపోటు, స్ట్రోక్ వచ్చే ప్రమాదం పెరుగుతుంది. అంతే కాకుండా స్వీట్లపై అల్యూమినియం యాడ్ చేయటం వల్ల కడుపులోకి చేరి మెదడుకు, ఎముకలకు నష్టం జరిగే అవకాశం ఉంటుంది.. క్యాన్సర్, నోటి క్యాన్సర్, లుకేమియా, కిడ్నీ వ్యాధులు, శ్వాసకోశ వ్యాధులు, అనేక రకాల అలర్జీలు వచ్చే అవకాశం ఉందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.. అందుకే బయట రోడ్ల పై దొరికే వాటిని కాకుండా మంచి పేరున్న షాపుల్లో కొనడం లేదా ఇంట్లోనే తయారు చేసుకొని తినడం మంచిది..