Diwali Festival 2025: దీపావళి పండుగ రోజున లక్ష్మీదేవి పూజ చేయడానికి అనేక పౌరాణిక, ధార్మిక, సాంస్కృతిక కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా ఈ పండగ రోజున లక్ష్మీదేవి భూలోకానికి వచ్చి తన తేజస్సుతో చీకటిని తరిమి కొట్టి భక్తులను అనుగ్రహిస్తుందని నమ్ముతారు.
ఇంటిల్లిపాది ఎంతో సందడిగా ఆనందంతో చేసుకునే దీపావళి పండుగకు వేళైంది. అమావాస్య చీకట్లను తరిమికొట్టి జీవితంలో వెలుగు జిలుగులు నింపే సంతోషాల సంబరం వచ్చేస్తోంది. అక్టోబర్ 20న దీపావళిని జరుపుకోనున్నారు. దీపావళి పండుగ ఆనందం, శ్రేయస్సు, ఐశ్వర్యం, కీర్తి, లక్ష్మీదేవి రాకను సూచిస్తూ చేసుకునే పండుగ. లక్ష్మీదేవిని సంపదకు పూజనీయమైన దేవతగా భావిస్తారు. ఏటా ఆశ్వయుజ మాసం కృష్ణపక్ష అమావాస్య నాడు జరుపుకొనే దీపావళి పండుగ రోజున భక్తిశ్రద్ధలతో లక్ష్మీదేవినీ ఆరాధిస్తాం. అమ్మవారిని ఎలా పూజించాలో ఇప్పుడు…
Diwali 2025: చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయులు అత్యంత ఘనంగా జరుపుకునే అతి పెద్ద పండుగలలో దీపావళి ఒకటి. ఇది కేవలం ఒక్క రోజు పండుగ కాదు.. ఐదు రోజుల పాటు ప్రత్యేక సంప్రదాయాలు, సాంస్కృతిక ఆచారాలతో కూడిన గొప్ప వేడుక. ఈ ఏడాది దీపావళి ప్రధాన పూజ (లక్ష్మీ పూజ) అక్టోబర్ 20వ తేదీన వచ్చింది. ఈ రోజున సాయంత్రం వేళ లక్ష్మీదేవి, గణేశుడిని భక్తిశ్రద్ధలతో పూజిస్తారు. ఈ ఏడాది…