డివిజనల్ హెడ్‌క్వార్టర్‌కు దూరంగా నివసించే ప్రజల అవసరాలను తీర్చడానికి 19 కొత్త జిల్లాలు, మరో మూడు డివిజనల్ హెడ్‌క్వార్టర్‌లను ఏర్పాటు చేయనున్నట్లు రాజస్థాన్ ప్రభుత్వం శుక్రవారం ప్రకటించింది. ఈ ఏడాది రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉన్న నేపథ్యంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ సంచలన ప్రకటన చేశారు.