ఏపీలో జిల్లాల విభజనపై టీడీపీ అధినేత చంద్రబాబు విమర్శలు చేశారు. జిల్లాల ఏర్పాటు అశాస్త్రీయంగా, రాజకీయ కోణంలోనే జరిగిందని చంద్రబాబు ఆరోపించారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్త జిల్లాలకు సంబంధించిన సమస్యలను సరిదిద్దుతామన్నారు. మరోవైపు ఏపీలో తాజా పరిస్థితులపై చంద్రబాబు పార్టీ నేతలతో చర్చించారు. జగన్ అనుసరిస్తున్న విధానాలతో ఏపీ కూడా త్వరలో శ్రీలంకలా మారే ప్రమాదం కనిపిస్తుందన్నారు. జగన్ పాలనపై ఆయన సొంత సామాజిక వర్గం కూడా సంతృప్తిగా లేదని చంద్రబాబు ఆరోపించారు. మరోవైపు…
ఏపీలో కొత్త జిల్లాల విభజన సందర్భంగా పలుచోట్ల ఆందోళనలు జరుగుతున్నాయి. అందులో అనంతపురం జిల్లా హిందూపురం నియోజకవర్గం కూడా ఉంది. పుట్టపర్తి కేంద్రంగా ప్రభుత్వం సత్యసాయి జిల్లాను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించగా.. ఆ నిర్ణయాన్ని హిందూపురం నియోజకవర్గ ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. హిందూపురం కేంద్రంగా జిల్లాను ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ, ఎంపీ గోరంట్ల మాధవ్, ఎమ్మెల్సీ మహ్మద్ ఇక్బాల్ కనబడడం లేదంటూ స్థానిక బీజేపీ నాయకులు స్థానిక వన్‌టౌన్…