ఏపీలో నిరుద్యోగులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది, 7,218 గ్రామ, వార్డు వాలంటీర్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని ప్రభుత్వం అన్ని జిల్లాల కలెక్టర్లను ఆదేశించింది. తాజా పోస్టులను జిల్లా యూనిట్‌గా భర్తీ చేయాలని ప్రభుత్వం సూచించింది. గతంలో మండల, పట్టణ యూనిట్‌గా వాలంటీర్లను నియమించగా.. ఇప్పుడు గ్రామాల్లో 4,213, పట్టణాల్లో 3,005 వాలంటీర్ల ఖాళీల భర్తీకి జిల్లాను యూనిట్‌గా తీసుకోవాలని తెలిపింది. ఈ మేరకు గ్రామ, వార్డు సచివాలయాల శాఖ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది.…
ఒక యజ్ఞంలా పాఠశాలల అభివృద్ధి.. తెలంగాణలోని ప్రభుత్వ పాఠశాలలకు నూతన హంగులు దిద్దేందుకు సిద్ధం అవుతుంది ప్రభుత్వం.. దీనిపై ఇవాళ అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన మంత్రులు హరీష్‌రావు, సబితా ఇంద్రారెడ్డి.. మన ఊరు, మన బడి పథకం అమలుపై చర్చించారు.. ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మార్చే బృహత్తర కార్యక్రమం మన ఊరు – మన బడి…. మన బస్తీ – మన బడి అని పేర్కొన్న మంత్రులు.. రూ.7289.54 కోట్లతో మూడు దశల్లో…
వివిధ రూపాల్లో ఆందోళనలు నిర్వహిస్తోన్న ఉద్యోగులు సమ్మెకు వెళ్లేందుకు సిద్ధం అవుతున్నారు.. అయితే, చర్చల ద్వారా సమ్మెకు వెళ్లకుండా ఆపాలంటూ.. అన్ని జిల్లాల కలెక్టర్లు, హెచ్‌వోడీలకు ఆదేశాలు జారీ చేశారు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ.. రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగ సంఘాలు చేస్తున్నఆందోళన కార్యక్రమాలపై ఉద్యోగ సంఘాలతో మాట్లాడి వివిధ అంశాలను చర్చలు ద్వారా పరిష్కరించుకునేందుకు ఆందోళనను విరమించి ముందుకు వచ్చేలా ఉద్యోగ సంఘాలను ఒప్పించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలక్టర్లను ఆదేశించారు. ఆర్ధికశాఖ…
ఏపీలో పీఆర్సీ వ్యవహారంలో చిక్కుముడులు వీడకపోవడంతో జనవరి నెల జీతాల పరిస్థితిపై ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికీ ప్రాసెస్ కాని జీతాలు, పెన్షన్ల బిల్లులను ప్రాసెస్ చేసే బాధ్యతను డీడీఓలకంటే పైస్థాయి అధికారులకు అప్పగించారు. ఎలాగైనా జీతాల ప్రక్రియ పూర్తిచేయాలని ఆదేశాలు రావడంతో అధికారులు తలలు పట్టుకుంటున్నారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు వివిధ జిల్లాల కలెక్టర్లు. జీతాల బిల్లులు ప్రాసెస్ కాకుంటే ప్రత్యామ్నాయాలు చూడాలన్న ప్రభుత్వం ఆదేశాల మేరకు డీడీఓలకంటే పై స్థాయి అధికారులకు బాధ్యతల…
దేశమంతా గణతంత్ర దినోత్సవాలు ఘనంగా జరుపుకుంటోంది. కేరళలో మంత్రి అహ్మద్ దేవరకోవిల్ పొరపాటు పడ్డారు. ఆయన ఎగరేసిన జాతీయ జెండా తలకిందులు అయినట్టు మీడియా చెబితే అర్థమయింది. మంత్రి, జిల్లా కలెక్టర్‌తో పాటు గణతంత్ర దినోత్సవాల్లో పాల్గొన్న అధికారులు కూడా తలకిందులైన జాతీయ జెండాకు సెల్యూట్ చేయడం గమనార్హం. READ ALSO దేశంలో భారీగా తగ్గిపోతున్న గాడిదల సంఖ్య.. కారణం ఏంటంటే? ఈ విషయాన్ని పాత్రికేయులు గుర్తించి, అధికారుల దృష్టికి తీసుకెళ్ళడంతో తిరిగి మరోమారు జెండా ఎగరేయాల్సి…
మద్యం దుకాణాల కేటాయింపులో రిజర్వేషన్లపై ప్రభుత్వం మార్గ దర్శకాలు విడుదల చేసింది. ఎస్సీ, ఎస్టీ, గౌడ్‌లకు ప్రభుత్వం నిర్ణయించిన ప్రకారం రిజర్వేషన్ల ప్రకారం దుకాణాలు కేటాయిం చేందుకు మార్గదర్శకాలనను ప్రకటించింది. కొత్త జిల్లాలను యూని ట్‌గా చేసుకుని కేటాయింపులు చేసేందుకు కలెక్టర్లకు అధికారం ఇచ్చింది. ఈ కేటాయింపుల కోసం నేతృత్వంలో నలుగురు సభ్యు లతో కమిటీ ఏర్పాటు చేశారు. ఈ కమిటీలో సభ్యులుగా జిల్లా ఎక్సైజ్ అధికారి,గిరిజన అభివృద్ధి అధికారి, బీసీ సంక్షేమ అధికారి, ఎస్సీ అభివృద్ధి…
ఇక, క్షేత్రస్థాయిలో పర్యటనలకు సిద్ధం అవుతున్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్.. స్పందన వీడియో కాన్ఫరెన్స్‌లో దీనిపై సంకేతాలు ఇచ్చారు.. గ్రామ, వార్డు సచివాలయాల్లో తనిఖీలు చాలా ముఖ్యమన్న ఆయన.. అలసత్వం వహించిన అధికారులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వచ్చే నెల నుంచి ఎమ్మెల్యేలు సచివాలయాలను సందర్శించాలని ఆదేశించిన సీఎం జగన్.. డిసెంబర్ నుంచి నేను కూడా సచివాలయాలను సందర్శిస్తానని తెలిపారు. స్పందన వీడియో కాన్ఫరెన్స్‌లో గృహనిర్మాణం, ఉపాధిహామీ పనులు, వైయస్సార్ అర్బన్ క్లినిక్స్, గ్రామ, వార్డు…
ఏపీలో కొందరు జిల్లా కలెక్టర్లపై బదిలీ వేటు పడనుందా? సచివాలయవర్గాల్లో జరుగుతున్న ప్రచారం ఏంటి? ప్రత్యేకించి కొన్ని జిల్లాల కలెక్టర్ల పనితీరుపై ప్రభుత్వానికి అదేపనిగా ఫిర్యాదులు అందుతున్నాయా? ఇంతకీ ఆ ఐఏఎస్‌లు ఏం చేస్తున్నారు? ఫిర్యాదుల వెనక కథేంటి? లెట్స్ వాచ్! ఏపీలో త్వరలో కలెక్టర్ల బదిలీలు?కొందరు కలెక్టర్లపై ప్రభుత్వానికి ఫిర్యాదులు! ఆంధ్రప్రదేశ్‌లో ఈ మధ్య కృష్ణా, శ్రీకాకుళం, అనంతపురం జిల్లాల కలెక్టర్లు బదిలీ అయ్యారు. శ్రీకాకుళం మినహా మిగతా ఇద్దరు బదిలీ ఉద్యోగ, అధికారవర్గాల్లో కాస్త…
సీఎం కేసీఆర్ విజన్ మేరకు అధికారులు పనిచేయాలని స్ధానిక సంస్ధల్లో ఆకస్మీక తనిఖీలు నిర్వహించాలని, గ్రామాలలో రాత్రి బస చేసి పారిశుధ్ధ్యం, ఇతర అభివృద్ధి కార్యక్రమాలను పర్యవేక్షించాలని ఆదేశించారు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్.. జిల్లా కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు (స్ధానిక సంస్ధలు), డిఎఫ్ఓలు, డిపిఓ లు, డిఆర్ డిఓ లు, మున్సిపల్ కమీషనర్లు ఇతర అధికారులతో స్ధానిక సంస్ధల నిర్వహణ పనితీరులో మెరుగుదల, తెలంగాణకు హరితహారం, ధరణి, వ్యాక్సినేషన్ లపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన…