బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర తూఫాన్ ప్రభావంతో ఉత్తర, దక్షణ తెలంగాణా జిల్లాలో ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో ఆయా జిల్లాల కలెక్టర్లతో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ధాన్యం సేకరణ అంశాలపై జిల్లా కలెక్టర్లతో పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ వీడియో కాన్పరెన్స్ నిర్వహించారు. తెలంగాణలో సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ధాన్యం కొనుగోళ్లు వేగంగా కొనసాగుతున్నాయని మంత్రి గంగుల అన్నారు. రైస్ మిల్లుల వద్ద స్పేస్ లేకున్నా.. మిల్లులు సహకరించకున్నా.. తక్షణం ఇంటర్మీడియట్ గోడౌన్లలో ధాన్యం దించండి అంటూ ఆయన పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్ వైపు మరోతుఫాన్ దూసుకొస్తుంది.. ఆగ్నేయ బంగాళాఖాతంలో తీవ్రవాయుగుండం తుఫాన్‌గా బలపడింది. అయితే ఈ తుఫాన్ కి ‘మాండూస్’గా నామకరణం చేశారు. కారైకాల్‌కు తూర్పు-ఆగ్నేయంగా 530 కి.మీ., చెన్నైకి 620 కి.మీ దూరంలో కేంద్రీకృతమైఉన్న తుఫాన్.. పశ్చిమ-వాయువ్య దిశగా పనయిస్తోంది.. రేపు అర్ధరాత్రి పుదుచ్చేరి- శ్రీహరికోట మధ్య తీరం దాటే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.. ఇక, తీరం దాటే సమయంలో 65-85 కిమీ వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని, దీని ప్రభావంతో మూడు రోజులపాటు దక్షిణకోస్తాలోని…
ఇవాళ జిల్లాల కలెక్టర్లతో సీఎం కేసీఆర్ సమావేశం కానున్నారు. డిసెంబర్ లో అసెంబ్లీ సీతాకాల సమావేశం జరుగనుండటంతో రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలపై సమీక్ష నిర్వహించనున్నారు సీఎం. ఉదయం 11గంటలకు ప్రగతిభవన్ లో ప్రధానంగా ధరణీలో సమస్యల పరిస్కారమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు సమాచారం.
Andhra Pradesh: ఏపీ వ్యాప్తంగా చర్చిల అభివృద్ధికి రూ.175 కోట్ల నిధులను ప్రభుత్వం ఖర్చు చేయనుంది. ఈ నిధులను చర్చిల నిర్మాణం, మరమ్మతులు, ఇతర పనులకు ప్రభుత్వం వినియోగించనుంది. ఈ మేరకు ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి రూ.కోటి మేర అందించనుంది. కొత్త చర్చిల నిర్మాణం, పాత చర్చిల పునర్నిర్మాణం, మరమ్మతులు, చర్చి నిర్వహించే సంస్థలు, స్మశాన వాటికల ఆధునీకరణకు ఈ నిధులు వెచ్చించాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. జిల్లా కేంద్రాలలో అదనంగా మరో రూ.కోటి విలువైన…
వృద్ధి రేటులో ఆంధ్రప్రదేశ్ టాప్‌లో నిలవడంపై సంతోషం వ్యక్తం చేశారు ముఖ్యమంత్రి.. 2021–22లో ఏపీ స్థూల ఉత్పత్తి వృద్ధిరేటు 11.43 శాతంగా నిలవడం సంతోషకరమన్న ఆయన.. దేశ వృద్ధిరేటు కంటే అధికంగా ఉంది.. పారదర్శక విధానాలే ఈ వృద్ధికి మూలకారణమని భావిస్తున్నాం అన్నారు.
తెలంగాణలో మార్చిలోనే రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి.. రాష్ట్రంలోనే అత్యధిక ఉష్ణోగ్రతలు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో నమోదు అయ్యాయి.. కొమురం భీం జిల్లా కెరమెరిలో ఇవాళ అత్యధికంగా 43.9, కౌటాలలో 43.7, చెప్రాలలో 43.8 డిగ్రీలుగా నమోదు కాగా.. జైనాథ్‌లో 43.8 డిగ్రీలు నమోదు కావడం ఆందోళనకు గురిచేస్తోంది.. అయితే, ఎండ తీవ్రత నేపథ్యంలో పాఠశాలల సమయం కుదించాలని ఆదేశాలు జారీ చేశారు సీఎస్ సోమేష్ కుమార్.. రాష్ట్రంలో ఎండ తీవ్రతపై అప్రమత్తంగా ఉండాలని జిల్లా…