దళిత బంధు పథకంతో రాష్ట్రంలోని దళిత కుటుంబాలు అభివృద్ధి చెందుతాయని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ అన్నారు. శంషాబాద్ దళిత బంధువు పథకం ద్వారా ఎంపికైన 57 మంది లబ్ధిదారులకు 5 కోట్ల 64 లక్షల రూపాయల వాహనాలను పంపిణీ చేశారు. అనంతరం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి, డాక్టర్ అంబేడ్కర్ చిత్రపటాలకు పాలభిషేకం చేశారు. మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రజలు ఏమి కోరుకుంటున్నారో పాలకుడిగా ముఖ్యమంత్రి కేసీఆర్ అదే అమలు పరుస్తున్నారని…