డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ లో ఘన విజయం సాధించిన వెబ్ సిరీస్ ‘పరంపర’ త్వరలో సెకండ్ సీజన్ కు రెడీ అవుతోంది. ఈ వెెబ్ సిరీస్ లో జగపతి బాబు, శరత్‌కుమార్, నవీన్ చంద్ర కీలక పాత్రల్లో నటించారు. ఎల్. కృష్ణ విజయ్, అరిగెల విశ్వనాథ్ దర్శకత్వంలో ఈ వెబ్ సిరీస్ తెరకెక్కింది. శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని ఈ సిరీస్‌ను నిర్మించారు. పొలిటికల్, రివెంజ్, యాక్షన్ థ్రిల్లర్‌గా ఈ సిరీస్ ను రూపొందించారు. గతేడాది…
షర్మిలా టాగోర్ ఒకప్పుడు ఆసేతు హిమాచల పర్యంతం అభిమానగణాలను సంపాదించి, ఎందరో రసికుల కలలరాణిగా జేజేలు అందుకున్నారు. షర్మిల నటించిన ప్రేమకథా చిత్రాలు చూసి, ఆమె వీరాభిమానులుగా మారినవారెందరో! ఆమెపై అభిమానంతో తమ ఆడపిల్లలకు ‘షర్మిల’ అని నామకరణం చేసిన వారూ లేకపోలేదు. అంతలా ఆ రోజుల్లో అభిమానులను ఆకట్టుకున్న షర్మిలకు ప్రస్తుతం 75 ఏళ్ళ వయసు. ఆమె తనయుడు సైఫ్ అలీఖాన్, కూతురు సోహా అలీఖాన్ సైతం తల్లి బాటలో పయనించి, నటులుగా అలరించారు. అందులో…
పాపులర్ స్టార్ హీరోలకు ఒక్కోసారి ఊహించిన సమస్యలు ఎదురవుతాయి. అయితే వాటిని వారు స్పోర్టివ్ గా తీసుకుంటారు. బట్.. ఫ్యాన్స్ మాత్రం తలకెక్కించుకుని, కిందామీద పడుతుంటారు. గతంలో మల్టీనేషన్ కు చెందిన రెండు బేవరేజ్ కంపెనీలు తమ కూల్ డ్రింక్స్ ప్రచారంలో మెగాస్టార్ చిరంజీవిని, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ను ఎదుటెదుట నిలబెట్టాయి. చిరంజీవి ఒక కంపెనీని ప్రమోట్ చేయగా, అదే సమయంలో పవన్ కళ్యాణ్ మరో కంపెనీకి ప్రచారం చేశాడు. ఆ యాడ్ స్క్రిప్ట్…
కొవిడ్ కారణంగా ఎన్నో రంగాలు అతలాకుతలం అయిపోయాయి. అయితే ఎంటర్ టైన్ మెంట్ ఇండస్ట్రీలోని ఓటీటీ రంగంలో మాత్రం విశేషమైన గ్రోత్ కనిపిస్తోంది. మరీ ముఖ్యంగా ఫిల్మ్ ఎగ్జిబిషన్ రంగం తీవ్రంగా దెబ్బ తిన్నప్పటికీ దానికి ప్రత్యామ్నాయంగా వచ్చిన ఓటీటీ ప్లాట్ ఫామ్ విపరీతంగా లాభపడింది. మూవీస్, వెబ్ సీరిస్, స్పెషల్ ప్రోగ్రామ్స్ తో ఓటీటీ సంస్థలు తమ వీక్షకులను రెండేళ్ళుగా విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో డిస్నీ ప్లస్ హాట్ స్టార్ సంస్థ త్వరలో తాము…