కొవిడ్ కారణంగా ఎన్నో రంగాలు అతలాకుతలం అయిపోయాయి. అయితే ఎంటర్ టైన్ మెంట్ ఇండస్ట్రీలోని ఓటీటీ రంగంలో మాత్రం విశేషమైన గ్రోత్ కనిపిస్తోంది. మరీ ముఖ్యంగా ఫిల్మ్ ఎగ్జిబిషన్ రంగం తీవ్రంగా దెబ్బ తిన్నప్పటికీ దానికి ప్రత్యామ్నాయంగా వచ్చిన ఓటీటీ ప్లాట్ ఫామ్ విపరీతంగా లాభపడింది. మూవీస్, వెబ్ సీరిస్, స్పెషల్ ప్రోగ్రామ్స్ తో ఓటీటీ సంస్థలు తమ వీక్షకులను రెండేళ్ళుగా విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో డిస్నీ ప్లస్ హాట్ స్టార్ సంస్థ త్వరలో తాము వీక్షకులకు అందించబోతున్న వినోదాల చిట్టాను విప్పింది.
టిస్క చోప్రా, సౌరబ్ శుక్లా, రాజేశ్ తైలంగ్ ప్రధాన పాత్రలు పోషించిన సూపర్ నేచురల్ థ్రిల్లర్ ‘ఫియర్ 1.0’; షెఫాలీ షా, కృతి కుల్హరి కీ రోల్స్ ప్లే చేసిన మెడికల్ డ్రామా ‘హ్యూమన్’; ప్రతీక్ గాంధీ, రిచా చద్దా ప్రధాన పాత్రలు పోషించిన మర్డర్ మిస్టరీ ‘సిక్స్ సస్పెక్ట్స్’ త్వరలో ప్రసారం కాబోతున్నాయి. అలానే సిద్ధార్థ్, జావేద్ జఫ్రీ, రిత్విక్ సాహోర్ నటించిన టెక్ థ్రిల్లర్ ‘ఎస్కేప్ లైవ్’; మురళీశర్మ, నందు, అక్షర గౌడ, సోనియా అగర్వాల్ కీలక పాత్రలు పోషించిన ‘ఫ్యామిలీ మేటర్స్’ స్ట్రీమింగ్ కాబోతున్నాయి. శరత్ కుమార్, జగపతిబాబు, నవీన్ చంద్ర నటించిన తెలుగు వెబ్ సీరిస్ ‘ఘర్షణ’ సైతం డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కు సిద్ధంగా ఉంది. అనుజా చౌహాన్ నవల ఆధారంగా రూపుదిద్దుకున్న ‘దోజ్ ప్రైసీ ఠాకూర్ గర్ల్స్’ వెబ్ సీరిస్ కూడా త్వరలో స్ట్రీమింగ్ కాబోతోంది. ఇందులో అక్షయ్ ఓబెరాయ్ తో పాటు సాహెర్ బంబా, రాజ్ బబ్బర్, పూనమ్ థిల్లన్, పద్మినీ కల్హాపూరి తదితరులు కీలక పాత్రలు పోషించారు. అలానే సత్యరాజ్ నటించి ఫస్ట్ వెబ్ సీరిస్ ‘మై పర్ ఫెక్ట్ హజ్బెండ్’ తో పాటు సుస్మితా సేన్ కీలక పాత్ర పోషించిన ‘ఆర్య’ థర్డ్ సీజన్ టెలీకాస్ట్ కాబోతోంది.
Read Also : పోర్న్ వీడియోస్ వివాదంపై ఆశా సైనీ వివరణ
ఇక అజయ్ దేవ్ గన్ మూవీ ‘రుద్ర: ది ఎడ్జ్ ఆఫ్ డార్క్ నెస్’తో పాటు నగేశ్ కుకునూర్ ‘సిటీ ఆఫ్ డ్రీమ్స్’ సెకండ్ సీజన్, నిఖిల్ అద్వాని హిస్టారికల్ డ్రామా ‘ఎంపైర్’ రాబోతున్నాయి. ఇందులో కునాల్ కపూర్, డినో మోరియా, షబానా ఆజ్మీ కీలక పాత్రలు పోషించారు. అలానే అజయ్ దేవ్ గన్, సోనాక్షి సిన్హా ‘భుజ్’తో పాటు, సైఫ్ అలీఖాన్, అర్జున్ కపూర్, జాక్విలిన్ ఫెర్నాండేజ్, యామీ గౌతమి నటించిన ‘భూత్ పోలీస్’ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కాబోతున్నాయి.