దగ్గుబాటి రానా, సాయి పల్లవి జంటగా వేణు ఉడుగుల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం విరాట పర్వం. సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ ఫై సురేష్ బాబు, సుధాకర్ చెరుకూరి సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు. కరోనా కారణంగా వాయిదాల మీద వాయిదాలు పడుతూ వస్తున్న ఈ సినిమాపై ఇప్పటికి మేకర్స్ దృష్టి పెట్టడంలేదంటున్నారు అభిమానులు. కరోనా తరువాత ఎన్నో సినిమాలు రిలీజ్ అయ్యాయి. గతేడాది ఏప్రిల్ లో రిలీజ్ కావాల్సిన ఈ సినిమా ఇప్పటికి రిలీజ్ డేట్ ని ప్రకటించలేదు.…