దగ్గుబాటి రానా, సాయి పల్లవి జంటగా వేణు ఉడుగుల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం విరాట పర్వం. సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ ఫై సురేష్ బాబు, సుధాకర్ చెరుకూరి సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు. కరోనా కారణంగా వాయిదాల మీద వాయిదాలు పడుతూ వస్తున్న ఈ సినిమాపై ఇప్పటికి మేకర్స్ దృష్టి పెట్టడంలేదంటున్నారు అభిమానులు. కరోనా తరువాత ఎన్నో సినిమాలు రిలీజ్ అయ్యాయి. గతేడాది ఏప్రిల్ లో రిలీజ్ కావాల్సిన ఈ సినిమా ఇప్పటికి రిలీజ్ డేట్ ని ప్రకటించలేదు. అస్సలు ఈ సినిమాను రిలీజ్ చేస్తారా..? అనే అనుమానం కూడా ప్రేక్షకుల్లో వచ్చింది అంటే అతిశయోక్తి కాదు.
ఇక గత కొన్ని రోజుల నుంచి ఈ సినిమా ఓటీటీలో రిలీజ్ కానున్నట్లు వార్తలు గుప్పుమంటున్నాయి. ఇక ఈ వార్తలపై రానా స్పందిస్తూ అలాంటిది లేదని, సినిమా థియేటర్లోనే రిలీజ్ అవుతుందని ఒకసారి క్లారిటీ ఇచ్చాడు. దీంతో రానా అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. ఇకతాజాగా మరోసారి ఈ సినిమా ఓటీటీలోనే రిలీజ్ అవుతుందని వార్తలు గుప్పుమన్నాయి. ఈ సినిమాకు ఓటీటీ భారీ డీల్ కూడా ప్రకటించిందని టాక్ నడుస్తోంది . ఒక ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నిర్మాతలకు దాదాపు రూ.50 కోట్లు ఆఫర్ చేసిందని, ఇందులో రూ.41 కోట్లు డిజిటల్ రిలీజ్‌కి, రూ.9 కోట్లు శాటిలైట్ హక్కులకి ఇస్తామని బంఫర్ ఆఫర్ ప్రకటించినట్లు సమాచారం. అయితే ఈ ఆఫర్ ని సురేష్ బాబు తీసుకున్నాడా..? లేదా అనేది తెలియాల్సి ఉంది. మరి ఓటీటీ విడుదలకు రానా ఈసారైనా ఒప్పుకుంటాడా..? లేదో తెలియాలి.