సీనియర్ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావులో సంగీత దర్శకుడు కూడా ఉన్నాడు. కొన్ని కన్నడ చిత్రాలతో పాటు యానిమేషన్ మూవీ ‘ఘటోత్కచ’కు, తెలుగు సినిమా ‘వెల్ కమ్ ఒబామా’కు ఆయన స్వరాలు సమకూర్చారు. తొంభై వసంతాలు దరిచేరినా ఇప్పటికీ ఎంతో ఎనర్జిటిక్ గా ఉంటారు సింగీతం శ్రీనివాసరావు. ఇటీవల కరోనా బారిన పడి తిరిగి కోలుకున్నారు. దర్శకత్వంతో పాటు రచన, సంగీతం ఈ రెండింటినీ సింగీతం ఇష్టపడతారాయన. ఇప్పటికీ సంగీత సాధన చేస్తూ, ఎంతో మందిలో స్ఫూర్తిని నింపుతుంటారు.…