అల్తాఫ్ హసన్ హీరోగా, శాంతిరావు, లావణ్యారెడ్డి, సాత్వికాజే హీరోయిన్లుగా రూపొందిన చిత్రం ‘బట్టల రామస్వామి బయోపిక్’. సెవెన్‌హిల్స్ సతీశ్, రామ్ వీరపనేని నిర్మించిన ఈ చిత్రాన్ని నూతన దర్శకుడు రామ్ నారాయణ్ తెరకెక్కించారు. ఈ చిత్రానికి సంగీతo కూడా ఆయనే. ‘బట్టల రామస్వామి బయోపిక్’ ఇటీవలే జీ5 ఓటిటి చానల్‌లో విడుదలై చక్కని విజయాన్ని నమోదు చేసుకున్న సంగతి తెలిసిందే. ‘బట్టల రామస్వామి…’ చిత్రాన్ని చూసిన అనేకమంది సెలబ్రిటీలు, విమర్శకులు సినిమా టీమ్‌ను అభినందించటం విశేషం. ఇదంతా…